30-01-2025 12:00:00 AM
సుమారు ఇరవై ఆరు సంవత్సరాలుగా కోల్ మైన్స్ రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్‌ను పెంచక పోవడం అన్యాయం. ఈ ఉద్యోగుల ‘పెన్షన్ చట్టంలో పేర్కొన్న విధంగా కనీసం మూడు సంవత్సరాలకు ఒకసారి పరిస్థితులను పరిశీలించి ఆ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచవలసి ఉంటుంది.
కానీ, గత మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వం అదేమీ పట్టించుకోవడం లేదు. బొగ్గు గనులలో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల దీనావస్థ చెప్పనలవి కాదు. ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలతో వారంతా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
పెన్షన్ మొత్తం పెంపుదల కోసం ఇటీవల భారత ప్రభుత్వ బొగ్గు కార్యదర్శి, అదనపు కార్యదర్శి, ప్రజాప్రతినిధులకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతి పత్రాలు సమర్పించారు కూడా. ప్రభుత్వం వారికి కనీస పింఛను మొత్తాన్ని పెంచవలసిందిగా మనవి.
దండంరాజు రాంచందర్ రావు, హైదరాబాద్