calender_icon.png 19 April, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు పింఛన్ ఇవ్వాలి

19-04-2025 07:26:58 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు 3 వేల చొప్పున పింఛన్ ఇవ్వాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి గాదె లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా సీపీఐ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాల్గవ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కార్మిక సంక్షేమ బోర్డులను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

భావన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, సహజ మరణం, డెలివరీ స్కీం లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచాలని కోరారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, కార్మికులంతా ఐక్యంగా నిలబడి ఈనెల 21, 22 తేదీల్లో శంషాబాద్ లో నిర్వహించే రాష్ట్ర మహాసభకు తరలివచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు విజయ్ సారథి, ప్రధాన కార్యదర్శి రేషన్ పల్లి నవీన్, మల్లికంటి వెంకన్న, మంద శంకర్, వెలుగు శ్రావణ్, బైస స్వామి, జలగం ప్రవీణ్, జానీ వెంకన్న, పెరుగు కుమార్, మేక వీరన్న, మామిండ్ల సాంబలక్ష్మి, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.