calender_icon.png 30 April, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్

28-04-2025 12:29:49 AM

ఇల్లెందు, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఏఐటీయూసీ  పోరాటాల ఫలితంగానే సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు పెన్షన్ వస్తుందని ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కే సారయ్య అన్నారు. ఆదివారం ఇల్లెందు పట్టణంలోని  విఠల్ రావు భవన్ లో  జరిగిన సింగరేణి కాంటాక్ట్ కార్మికుల  జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొమరయ్య నాయకత్వంలో సింగరేణిలో పనిచేస్తున్న 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను ఏఐటియుసి పోరాటాల ఫలితంగానే  సింగరేణి ఉద్యోగుల గుర్తించారన్నారు.

ఏఐటీయూసీ గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించామని, కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి వైద్యశాలలో చికిత్స అందే విధంగా జీవోను సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించామన్నారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు కూడా సింగరేణి క్యాంటీన్ లో అల్పాహారం అందే విధంగా సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘం మాట్లాడుతుందన్నారు.

కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో కాంట్రాక్టు కార్మికులకు పిఎఫ్, ఈఎస్‌ఐ నిధులను జమ చేయలేదని ఆ విషయాన్ని సింగరేణి జిఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.  కోల్ ఇండియాలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే సమాన పనికి సమాన వేతనం అందిస్తున్నారని, సింగరేణిలో అందించడం లేదని ఈ విషయంపై ఏఐటీయూసీ నిత్యం పోరాటం చేస్తూనే ఉందనన్నారు.

పోరాటాల ఫలితంగానే కార్మికుల హక్కులను సాధించగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, ఏటియుసి బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ఏఐటియుసి ఉపాధ్యక్షులు రాజారాం, ఏఐటీయూసీ నాయకులు అజ్మీర కిషోర్, ఉప్పలయ్య, విజయ్ కుమా ర్, స్వరూప, సోమమ్మ, హసీనా తదితరులు పాల్గొన్నారు.