calender_icon.png 23 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలిన గాయాలతో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలి

22-02-2025 11:38:44 PM

వైద్య సాయంతో పాటు దివ్యాంగుల పింఛన్ ఇవ్వాలి 

అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

హైదరాబాద్,(విజయక్రాంతి): కాలిన గాయాలతో లేవలేని స్థితిలో మంచానికే పరిమితమైన సలీమాను ఆదుకోవాలని, తక్షణమే ఆమె వైద్య సహాయం అందించడంతో పాటు దివ్యాంగుల పింఛను ఏర్పాటు చేయాలని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వాలన్నారు. వంట చేసుకుని తినే పరిస్థితి లేకపోవడంతో సలీమాకు భోజన సదుపాయం కల్పించాలన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం గుండ్ల సింగారం గ్రామానికి చెందిన సలీమా దీనస్థితిపై ఓ పత్రికలపై వచ్చిన కథనంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సీఎం ఆదేశాలతో సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాస్‌లు సూర్యాపేట జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. గాలిన గాయాల కారణంగా  నరాలు దెబ్బతినడంతో ఆమె మంచానికే పరిమితమైంది. దీంతో సలీమా కుమార్తె రిజ్వాన తల్లికి సపర్యలు చేస్తోంది. ఒక వైపు తల్లి బాధ్యతలు చూసుకుంటూనే బడికి వెళ్లి చదువుకోడం విశేషం.