కరీంనగర్, (విజయక్రాంతి): సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం జరిగే పెన్షన్ విద్రోహక దినం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులందరినీ ఎంప్లాయిస్ జేఏసీ తరఫున టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి సెప్టెంబర్ ఒకటవ తేదీన జరిగే నిరసన కార్యక్రమాలకు తప్పకుండా ఉద్యోగులందరూ హాజరుకావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ విద్రోహక దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జులతో భారీ నిరసన కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ ఆవరణంలో ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందని అట్టి కార్యక్రమానికి టీఎన్జీవోల జిల్లా సంఘం నాయకులు, తాలుకా అధ్యక్ష కార్యదర్శులు పెన్షన్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు అదేవిధంగా తెలంగాణ టీచర్స్ అసోసియేషన్ కు సంబంధించిన వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారి వారి సమస్త కార్యవర్గంతో పాటు వివిధ సిపిఎస్ సంఘాలకు సంబంధించిన నాయకులు. సిపిఎస్ ఉద్యోగులు మరియు జేఏసీలో భాగస్వాములైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు తప్పకుండా కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా, స్వచ్ఛందంగా హాజరై తమ గొంతును వినిపించి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యతను చాటి చేప్పే విధంగా, ప్రభుత్వానికి తమ గోడును విన్నవించుకునే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఎసి తరుపున కోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం మాజీ కార్యదర్శి ఎంఏ హమీద్ అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మీందర్ సింగ్ రూరల్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ నాయకులు ప్రభాకర్ రెడ్డి మోసం అంజయ్య లింగయ్య పోలు కిషన్ రవీందర్ రెడ్డి మల్కా రాజేశ్వరరావు అరసవెల్లి రాజేశ్వరరావు కరుణాకర్ జలాలుద్దీన్ అక్బర్ లవ కుమార్ కొండయ్య మహేందర్ రెడ్డి నగేష్ గౌడ్ శ్రీనివాసరావు నరసయ్య వెంకటేష్ రేవంత్ జీవన్ ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొన్నారు.