calender_icon.png 1 April, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్ తో పెంకుటిల్లు దగ్ధం

29-03-2025 06:18:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చిన్నబూజ గ్రామానికి చెందిన పెద్దపల్లి మల్లయ్యకు చెందిన పెంకుటిల్లు శనివారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పై భాగానికి ఎగిసిపడ్డాయి. మంటల్లో పై భాగంలో కప్పి ఉంచిన పెంకులన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఇంటి లోపలి భాగంలో కూడా మంటలు వ్యాపించి వస్తువులు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో రూ లక్ష నగదుతో పాటు కొంత బంగారం కాలిపోయినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు పెద్దపల్లి మల్లయ్య వేడుకున్నారు.