calender_icon.png 27 November, 2024 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పనులను వేగవంతం చేయాలి

29-10-2024 03:42:33 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న నాలాలు, ఫ్లుఓవర్ల నిర్మాణాల పనులను వేగవంతం చేసి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌లలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నగరంలో 23 సంపుల పనుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశంలో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ సీఈ దేవానంద్, ఎస్‌ఎన్‌డీపీ సీఈ కోటేశ్వరరావు, సీఈ మెయింటనెన్స్ భాస్కర్ రెడ్డి, వివిధ జోన్ల ఎస్‌ఈలు పాల్గొన్నారు. 

సెట్విన్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది

ప్రభుత్వరంగ సంస్థ అయిన సెట్విన్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పురానాపూల్‌లో నిర్మించిన ఆ సంస్థ చైర్మన్ కార్యాలయాన్ని సోమవారం చైర్మన్ ఎన్ గిరిధర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సెట్విన్ మినీ బస్సు సర్వీసులను విస్తరింపజేసేందుకు శాఖ పరంగా తన సహకారం ఉంటుందన్నారు. జహీరాబాద్, హుస్నాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, జడ్చర్లతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో త్వరలోనే సెట్విన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. సెట్విన్ అకౌంట్స్ ఆఫీసర్ సురేశ్‌బాబు, మేనేజర్ అబ్దుల్ మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.