calender_icon.png 4 April, 2025 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలి

25-03-2025 01:25:47 AM

సీతారామ ప్రాజెక్టును సందర్శించి రైతుల కష్టాలను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాణోత్ చంద్రావతి

వైరా,మార్చి.24 ( విజయక్రాంతి ):- బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో  సీతారామ ప్రాజెక్టు పనులు వేగంగా నడిచాయని, కాంగ్రెస్ గవర్ణమెoట్ వచ్చిన తర్వాత 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని, నిధుల కేటాయింపులో జాప్యంతో గుత్తేదారులు కూడా ముందుకు రావడం లేదని వైరా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాణోత్ చంద్రావతి అన్నారు.

బడ్జెట్‌ని పెంచి రాబోయే రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమండ్  చేశారు.సోమవారం ఆమె ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పనులు పరిశీలించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ వైరా లింక్ కెనాల్ కి సంబంధించి 18 కిలోమీటర్లు మేర వెనక్కి మళ్లింపు అసాధ్యం అన్నారు.సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుంచి తిమ్మరావు పేట సమీపంలో హెడ్ రెగ్యులేటర్ వద్ద అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోగంగా  వుంటుందన్నారు.

ఈ నిర్మాణాన్ని పున పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఐదుదారు కిలోమీటర్ల వ్యత్యాసంతో సాగు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అమే డిమాండ్ చేశారు..తద్వారా  ప్రజాధనాన్ని కూడా ఆదా చేసినట్లు అవుతుందని  వ్యాఖ్యానించారు.ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఒక ప్రాంతానికే ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ సవతి తల్లి ప్రేమను వ్యక్త పరచడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు.

సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులందరికి సమానంగా సాగు నీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.బిఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేసేందుకే పెండింగ్ పనుల లింక్ కెనాల్  ప్రాంతాన్ని  సందర్శించడం జరిగిందని అన్నారు. ప్రత్యామ్నాయoతొ పాలేరు జలాశయాన్ని నింపి తాగునీరు సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.110 కిలోమీటర్ల తవ్విన కెనాల్ లో వాటర్ నింపి జూలూరు పాడు,ఏన్కూరు, వైరా వరకు గల  గిరిజన ప్రాంత  రైతులకు చెందిన పంట పొలాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు..