calender_icon.png 11 February, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ టవర్ పెండింగ్ పనులను పూర్తి చేయాలి

10-02-2025 07:11:48 PM

మాజీ మంత్రి రామన్న...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేష్ రంజన్ ను హైదరాబాద్ లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటి పరిశ్రమలను పట్టణాలకు విస్తరించడంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో ఆదిలాబాద్ జిల్లాకు ఐటి టవర్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. వివిధ కారణాల వల్ల ఐటి టవర్ పనులు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని మాజీ మంత్రి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా ఆదిలాబాద్‌లో స్థాపించి, ప్రైవేట్ భవనాల్లో పని చేస్తున్న కంపెనీల్లో సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో తమ వ్యాపారాన్ని విస్తరించుకోలేకపోతున్నాయి. ఈ సమస్య ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కావున ఈ విషయాన్ని పరిశీలించి, ఆదిలాబాద్‌లోని ఐటీ టవర్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని కార్యదర్శిని కోరినట్లు జోగు రామన్న తెలిపారు.