హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ యూనియన్ ధర్నా
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద సోమవారం హైర్ వెహికిల్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హైర్ వెహికిల్స్ డ్రైవర్స్‌కు 16నెలలుగా జీతాలను చెల్లించడం లేదని యూనియన్ నాయకులు వాపోయారు. వేతనాలు రాక కుటుంబాలను కూడా పోషించుకోలేక పోతున్నామని, స్కూలు ఫీజులు కట్టకపోవడంతో తమ పిల్లలను పాఠశాలల యాజమాన్యాలు ఇంటికి పంపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఓపిక పట్టడం తమ వల్ల కాదని, జీతాలు చెల్లించే వరకు తాము వాహనాలను నడపబోమని కార్యాలయం ఎదుటే బైఠాయించారు. స్పందించిన అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపి.. సమస్య పరిష్కారానికి ఐదు రోజల సమయం ఇవ్వాలని కోరారు. ఐదు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని, వాహనాలను కూడా నడపబోమని హెచ్చరించారు.