ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయకాంతి): అటవీ శాఖ నర్సరీలలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం డిఎఫ్ఓ కార్యాలయ ఏవో వెంకటకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిర్యాని, సిర్పూర్, రెబ్బెన తదితర మండలాల్లో పనిచేస్తున్న కార్మికులకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు అప్పులు తెస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన లాభం లేకుండా పోతుందని పేర్కొన్నారు. వేతనాలు చెల్లించకపోతే డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ నర్సరీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘమిత్ర, కార్మికులు శంకరమ్మ, మీనాక్షి, తార, నిర్మల తదితరులున్నారు.