calender_icon.png 19 April, 2025 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కావెంజర్లకు పెండింగ్ వేతనాలను చెల్లించాలి..

16-04-2025 07:28:28 PM

ఇల్లెందు ఎంపీఓకు ఐఎఫ్టియు వినతి..

ఇల్లెందు టౌన్ (విజయక్రాంతి): ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామ పంచాయతీలో పాఠశాల స్కావెంజర్లకు, స్వీపర్, మెకానిక్, గ్రీన్ అంబాసిడర్లకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు అనుబంధ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఇల్లందు మండల పంచాయతీ అధికారి(ఎంపిఓ) చిరంజీవికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కొక్కు సారంగపాణి, రాష్ట్ర సహాయకార్యదర్శి ఎండి. రాసుద్దిన్ మాట్లాడుతూ.. బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న 7గురు స్కావెంజర్లకు 2023 అక్టోబర్ నుంచి 2024 జులై వరకు 10 నెలల వేతనాలు, గ్రీన్ అంబాసిడర్లు ఇద్దరికీ 2024 ఫిబ్రవరి నుంచి 2024 జూలై వరకు 6 నెలల వేతనాలు, బోర్ మెకానిక్ కు 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై వరకు 8 నెలల వేతనాలు నేటికీ చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి తొగర సామెల్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు రావూరి ఉపేందర్ రావు, కార్మికులు పాల్గొన్నారు.