15-04-2025 05:49:48 PM
ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిసి హాస్టల్స్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ హాస్టల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల 12 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వేతనాలు మంజూరు చేయకపోతే నిరవధిక సమ్మె కు దిగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, బీసీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమురయ్య, లక్ష్మి, శారద, పోశక్క, పార్వతి, శకుంతల, సరోజ, సుజాత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.