calender_icon.png 1 February, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రులు, టీచర్ల ఓటర్ నమోదు పెండింగ్ దరఖాస్తులను

01-02-2025 01:11:01 AM

 ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలి

కరీంనగర్, జనవరి31(విజయక్రాంతి): శాసన మండల సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు.

శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల అధికారి పమేలా సత్పతి  ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని అదనపు కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా  ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడు తూ, ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, ఫిబ్రవరి 11న స్క్రూట్ ని ఫిబ్రవరి 13 లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు , 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ అందించాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాలని,  ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనల ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అకౌంటింగ్ బందాలు, ఎంసిసి బందాలు, ఫ్లుయింగ్ స్క్వాడ్, వీ.ఎస్.టి , వీ.వి.టి మొదలగు బందాలను వెంటనే ఏర్పాటు చేయాలని  తెలిపారు. మండలాల్లో ఈ రోజు వరకు ఓటర్ నమో దు కోసం వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని, పెండింగ్ ఉన్న పట్టభద్రులు, టీచర్స్ ఓటర్ నమోదు దరఖాస్తులను ఫిబ్రవరి 7 లోపు  పరిష్కరించాలని  ఆదేశించారు. ఈ టెలికా న్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.