09-04-2025 01:39:27 AM
సంగారెడ్డి, ఏప్రిల్ 8(విజయ క్రాంతి)సంగారెడ్డిలోని మహిళా ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వృద్ధాశ్రమం, బాల రక్షాబంధన్ ను కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సందర్శించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఉండాల్సిన మౌలిక సదుపాయాల గురించి కూలంకషంగా డీడబ్ల్యుఓ లలిత కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ వనజారెడ్డి, డీఈ దీపక్ లతో చర్చించారు. వయో వృద్ధులకు అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. వయో వృద్ధుల ఆశ్రమానికి అవసరమైన కిచెన్ రూమ్, వాష్ ఏరియా, నడవడానికి వాకింగ్ ఏరియా స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం బాలరక్ష భవన్ ను సందర్శించి ప్రతి గదిని పరిశీలించడం జరిగింది.
బాలరక్ష భవన్ లో సిబ్బంది ఉంటారని తెలిపారు. తదనంతరం రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేయనున్నటువంటి జనరిక్ మెడికల్ షాప్ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఐకెపి మహిళల పెట్రోల్ బంక్ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ కార్య క్రమంలో డిసిపిఓ రత్నం, ఎఫ్‌ఆర్‌ఓ సతీష్, వెంకటేష్, మేనేజర్ సుగుణమ్మ, ప్రసాద్, సఖి కల్పన తదితరులు పాల్గొన్నారు.