calender_icon.png 30 April, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలను విడుదల చేయాలి

30-04-2025 05:05:51 PM

పాపన్నపేట: గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణం విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఉపాధి హామీ సిబ్బంది ఎంపీడీఓ విష్ణువర్ధన్(MPDO Vishnuvardhan) కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి ఉద్యోగులు నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏపిఓ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు నెలల నుండి వేతనాలు లేకుండా ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఈజీఎస్ ఉద్యోగులకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన మేరకు వెంటనే అమలు చేయాలన్ననారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ లు రాము, నాగేందర్, ఇంచార్జి ఈసీ యాదగిరి, టెక్నికల్ అసిస్టెంట్ లు సుధాకర్, లక్ష్మణ్, బాలరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ తో పాటు తదితరులు ఉన్నారు.