calender_icon.png 5 January, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ జీతాలు ఇవ్వాలి

31-12-2024 02:03:46 AM

ముషీరాబాద్, డిసెంబర్ 30: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో పనిచేస్తున్న ఆర్‌పీ(రీసోర్స్ పర్సన్స్)లకు 7 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఆర్‌పీల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్‌సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు మానుకోట సుని  ప్రధాన కార్యదర్శి కంకణాల శ్రీమతి, కోశాధికారి ఎస్‌కే జహార రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్‌పీలపై అధికారుల ఒత్తిడి, వెట్టిచాకిరీలను అరికట్టి ప్రభుత్వ పరంగా నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 6 వేల మంది ఆర్‌పీలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నారని అన్నారు.

ప్రస్తు  రూ. 6 వేలు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం స్త్రీ నిధి వీఎల్‌ఆర్ నుంచి రూ.6 వేల గౌరవ వేతనాలు పొందుతున్నామని తెలిపారు. 7 నెలలుగా జీతాలు రాకపొ  నానా ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్య  సంఘం ప్రతినిధులు అనురాధ, స్వర్ణలత, హంసమ్మ, మంగదేవి, సునిత, యాదలక్ష్మీ, ఉషా, అనుణ పాల్గొనారు.