calender_icon.png 15 March, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

15-03-2025 06:52:05 PM

నిజాం కళాశాల వసతి గృహం పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా హాస్టల్ విద్యార్థుల ఆందోళన..

ముషీరాబాద్ (విజయక్రాంతి): నిజాం కళాశాల వసతి గృహం పారిశుద్ధ్య సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజాం కళాశాల వసతి గృహం పారిశుద్ధ్య సిబ్బందికి మద్దతుగా విద్యార్థులు హైదరాబాద్ బషీర్ బాగ్ లోని హాస్టల్ భవనం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. వసతి గృహంలో పారిశుద్ధ్య కార్మికులుగా 50 మంది పనిచేస్తున్నారని, గత 5, 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని సిబ్బంది వాపోయారు.

నెలకు 14 వేలు వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నెల నెలా జీతాలు ఇవ్వాలని, అప్పటి వరకు తాము పనులు చేయకుండా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు పనులు నిలిపి వేయడంతో వసతి గృహంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకపోవడంతో  దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల పారిశుద్ధ్య సిబ్బంది వేణు, రాజు వజ్రమ్మ, రేణుక, ఆండాలు, జోష్పిన్, మౌనిక, లాజరస్, నిజాం కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.