11-04-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 10 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లోని సింగరేణి క్వార్ట ర్లుకు చెందిన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి పాత క్వార్టర్సులలో నివసిస్తున్న వారికి డబ్బులు కట్టించుకుని కొంత మందికి జీవో నెంబర్ 76 ప్రకారం కొంతమందికి పట్టాలు ఇచ్చారని తెలిపారు. డబ్బు లు చెల్లించిన ఇంకా కొంతమందికి పట్టాలు రాలేదనీ వాపోయారు. ఇంకా చాలామంది పాత సింగరేణి క్వార్టర్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వలేదన్నారు. నామమాత్రపు రుసుము తీసుకొని అందరికీ జీవో నెంబర్ 58, 59 ప్రకారంగా అందరికీ పట్టాలు ఇవ్వవలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఎన్నిక లకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులందరికీ రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలన్నారు. రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సందర్భంగా అందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తే సన్నబియ్యం పొం దుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శిలు బొంతల లక్ష్మీనారాయణ, బెల్లంపల్లి మండల కార్యదర్శి, మేకల రాజేశం, రైతు సంఘం జిల్లా అధ్యక్షు లు గుండా చంద్రమాణిక్యం, బీకేఎంయూ జిల్లా కార్యదర్శి కొంకుల రాజేష్, పట్టణ సహాయ కార్యదర్శి, బొంకూరు రామచందర్, పట్టణ కార్యవర్గ సభ్యులు, రత్నం రాటజ్యం తదితరులు పాల్గొన్నారు.