calender_icon.png 15 January, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

12-07-2024 12:19:33 AM

జెన్కో ట్రాన్స్‌కో ఎండీ, చైర్మన్ రొనాల్డ్‌రాస్

నల్లగొండ, జూలై 11 (విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ ప్లాంట్ (వైటీపీఎస్) బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను గురువా రం పరిశీలించి పనుల పురోగతిపై జెన్కో, బీహెచ్‌ఈఎల్ అధికారులతో సమీక్షించారు. ఆగస్టు చివరి నాటికి మొదటి రెండు యూనిట్లకు బొగ్గు అందించేందుకు రైల్వే సైడింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బాయిలర్లు, టర్బైన్లు, కంట్రోల్ రూమ్, కూలింగ్ టవర్లు, ట్రాన్స్‌ఫార్మర్ యార్డు, 400 కేవీ స్విచ్‌యార్డ్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్లను ఆయన పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఆయన వెంట పలువురు ఇంజినీర్లు, అధికారులు ఉన్నారు.