కామారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): జిల్లాలో తుపాన్ ప్రభా వంతో సోమవారం అక్కడక్కడా వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యా ప్తంగా ధాన్యం, పత్తి, సోయా కొనుగోళ్లు నిలిచిపోయాయి. వాతావార ణం పొడిగా మారిన తర్వాతే కొనుగోళ్లు చేపడుతామని కొనుగోలు కేం ద్రాల నిర్వాహకులు చెబుతున్నారు.
కాగా మద్నూర్ వద్ద ఏర్పాటు చేసిన సోయా, సీసీఐ కేంద్రం వద్ద పత్తి కొనుగోళ్లను సైతం నిలిపివేశారు. అయితే కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలతో ఉన్న రైతులు అకాల వర్షంతో ఆందోళన చెందుతున్నారు.