calender_icon.png 22 April, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ పదోన్నతులు ప్రకటించాలి

06-04-2025 11:21:04 PM

బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య..

మంచిర్యాల (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వెంటనే ప్రకటించాలని, పదోన్నతులు కల్పించాలని బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య కోరారు. రామగుండం పర్యటనకు వచ్చిన సింగరేణి డైరెక్టర్ (పీపీ అండ్ పీఏడబ్ల్యూ) యన్ వెంకటేశ్వర్లుకి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు.

శ్రీరాంపూర్ ఏరియాలో నాలుగేండ్ల నుంచి పై క్యాటగిరీలలో యాక్టింగ్ చేస్తున్న ఫ్యాన్ ఆపరేటర్స్, బిట్ శార్పనర్స్ తదితర  వివిధ రంగాల కార్మికుల పదోన్నతులు ఖాళీలను ప్రకటించకుండా, పదోన్నతులు కల్పించకుండ శ్రమ దోపిడి చేస్తున్న సింగరేణి యాజమాన్యం వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థలో పారదర్శకంగా పదోన్నతులు కల్పించాలని, ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని డైర్టక్టర్ దృష్టికి విషయం తీసుకెళ్లిన వెంటనే తగు చర్యలు తీసుకొని పదోన్నతులు కల్పించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. 

వివిధ కారణాలతో గైర్హాజరు కార్మికులకు అవకాశం కల్పించాలి..

సింగరేణి సంస్థలో వివిధ కారణాలతో విధులకు గైర్హాజరవుతున్న కార్మికులను రకరకాల పేర్లతో విచారణలు చేస్తూ, కార్మికులను మానసిక ఇబ్బందులకు గురిచేస్తు ఉద్యోగాలకు ఉద్వాసన పలికి డిస్మిస్ చేయడం సరైన విధానం కాదని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) జిల్లా అధ్యక్షులు యాదగిరి సత్తయ్య అన్నారు. కార్మికులు వివిధ రకాల అనారోగ్యా కారణాలతో ఉన్నప్పటికీ కూడా విచారణ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఉద్వాసన పలుకుతున్న సింగరేణి యాజమాన్యం తన వైఖరిని పునసమీక్షించి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా కార్యదర్శి రాగం రాజేందర్, నాయకులు తిరునహరి కిరణ్ కుమార్, బుర్ర అరుణ్ కుమార్, ఆషాడపు రమేష్, చల్ల వేణు తదితరులు పాల్గొన్నారు.