హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): డీఎస్సీ పెండింగ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని డీఎడ్ బీఎడ్ అ భ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రా వుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో భాగంగా 10,006 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం.. పెండింగ్‌లో పెట్టిన స్పెషల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, దివ్యాంగుల పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. ఆయా పోస్టులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు.