calender_icon.png 17 November, 2024 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పెండింగ్ బకాయిలు చెల్లించాలి

17-11-2024 01:33:02 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య

కాప్రా, నవంబర్ 16(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాప్రా సర్కిల్ ఈసీఐఎల్ చౌరస్తాలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల మహార్యాలీని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భం గా కృష్ణయ్య మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను చెల్లించాలని నాలుగు నెలలుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఆర్థిక మంత్రికి కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏయే అంశాలకు ఎంతెంత ఖర్చుపెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.