calender_icon.png 30 November, 2024 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి

30-11-2024 03:01:26 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తుల ను  పరిష్కరించాలని  కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పీఎం కూసుమ్ పథకం,సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అధినం కలెక్టర్ విద్యా చందన తో కలసి ఆర్డీవోలు, తాసిల్దారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి  క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలి  అన్నారు.

అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్ని మండల తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు .పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించుకొని, పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ దరఖాస్తులు ఏ కారణములు చేత పరిష్కరింపబడలేదో లిఖితపూర్వక సమాచారాన్ని పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటాఎంట్రీ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట అదనపు కంప్యూటర్లు, అదనపు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేసుకొని, ఇందిరమ్మ ఇళ్ల  లబ్ధిదారులు ఎంపిక యాప్ ద్వారా పరిశీలన చేపట్టాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ కు సూచించారు. పీఎం కుసుమ్ (ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద మహిళా సమాఖ్య ద్వారా 1  మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ స్థాపనకు  జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్ కు  ఐదు కిలోమీటర్ల పరిధిలో అనువైన ప్రభుత్వ స్థలమును విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపనకు స్థలం గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా  పూర్తి చేయాలని కొత్తగూడెం మరియు భద్రాచలం ఆర్డీవో లను ఆదేశించారు.