calender_icon.png 25 February, 2025 | 1:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

24-02-2025 11:05:29 PM

కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): గాంధీనగర్ డివిజన్ లోని పలు బస్తీల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. ఈ మేరకు సోమవారం కార్పొరేటర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ... వి.వి. గిరి నగర్, ధోభి ఘాట్, మాల బస్తీలతో పాటు పలు చోట్ల షాబాద్ బండల ఏర్పాటు పెండింగ్లో ఉన్నాయని, అలాగే ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన మరిన్ని అభివృద్ధి పనులను అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్ లకు సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఇంజినీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ పాల్గొన్నారు.