calender_icon.png 27 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ డీఏలను విడుదల చేయాలి

10-10-2024 01:49:10 AM

సీఎం రేవంత్‌రెడ్డికి  పీఆర్టీయూ నేతల వినతి

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయ క్రాంతి): పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను విడు దల చేయడంతోపాటు, రెండేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, మెడికల్, సరెండర్ లీవ్‌లు, రిటై ర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, పుల్గం దామోదర్ రెడ్డి సీఎంను కోరారు.

ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం సచివాలయంలో పీఆర్టీయూ నేతలు, ఎమ్మె ల్సీ కూర రఘోత్తం రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మర్యాద పూర్వకంగా కలిసి టీచర్ల సమస్యలపై ఈ సందర్భంగా చర్చించారు.

ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించి పదోన్న తులు కల్పించాలని, కేజీబీవీ ఉపాధ్యాయుల కు కనీస వేతనం వర్తింపచేయాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు బీరెల్లి కమలాకర్‌రావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.