12-03-2025 01:30:45 AM
ఎస్పీ శరత్ చంద్రపవార్
నల్లగొండ, మార్చి 11 (విజయక్రాంతి) : జిల్లాలో పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి కేసు విచారణ పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. కేసు నమోదు, చార్జిషీట్ అంశాలన్నింటినీ కూలంకుషంగా పరిశోధించాలని చెప్పారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా విచారణ పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ వేయాలన్నారు. అవసరమైతే న్యాయమూర్తులను కలిసి కేసుల పరిష్కారానికి చొరవచూపాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, ఎస్‌బీ డీఎస్పీ రమేశ్, డీటీసీ డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, సీఐలు ఎస్‌ఐలు పాల్గొన్నారు.