గ్రామాల్లో మంచి నీటి సహాయకులకు శిక్షణ
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను యజ్ఞంగా చేపట్టాలి
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క
హైదరాబాద్, సెప్టెంబర్ 23(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరలో చెల్లిస్తామని పం చాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. సోమవార ం సచివాలయంలో విభాగాల వారీ గా జరుగుతున్న పనుల పురోగతిని సీత క్క సమీక్షించారు. ఆయా విభాగాల్లో కొ నసాగుతున్న పనుల పురోగతిని తెలుసుకు న్నారు. కొత్తగా చేపట్టబోయే పనులకు కా ర్యచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు.
డీఆర్‌డీఓ, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్
హెఓడీలతో సమీక్ష తర్వాత డీఆర్‌డీఓ,అడిషనల్ డీఆర్డీఓ, డీపీఓలతో మం త్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన వివ రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. జాతీయ స్థాయి లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా అధికారులు పని చేయాలని మంత్రి సీతక్క కోరారు.
ఈనెలలోపు సహాయకులను శిక్షణ
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫ రా విషయంలో తమ సర్కారు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని సీతక్క పేర్కొ న్నారు. ప్రతీ గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నా మన్నారు. 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతుందన్నారు. ఈనెలలో పు అన్ని గ్రామాల సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామని మంత్రి స్ప ష్టం చేశారు. బోర్లు పాడైతే అదేరోజు మరమ్మతులు జరిగేలా, పైపులు లీకైతే సరిచేసేలా సహాయకులు పని చేస్తారని వివరించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమా ర్, సెర్ఫ్ సీ ఈఓ దివ్యా దేవరాజన్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.