అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): పీఆర్టీయూ తెలంగాణ నూతన సంవత్సరం డైరీని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని, 317 జీవో బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటుందన్నారు. పెండిగ్ బిల్లు ల సమస్య కూడా త్వరలోనే పరిష్కారమవుతుందని ఆయన సంఘం నేతలో పేర్కొ న్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం చెన్నయ్య, మహ్మద్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.