11-12-2024 01:47:43 AM
* టీపీటీఎఫ్ అధ్యక్షుడు అనిల్‌కుమార్
కామారెడ్డి, డిసెంబర్ 10 (విజయక్రాం తి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం టీపీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ హాజరై ప్రసంగించారు. మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు తొమ్మి ది నెలల నుంచి పెండింగ్‌లో బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయుల మెడికల్ సరెండ్ బిల్లులు, పెన్షనర్స్‌కు సంబంధించిన అన్ని బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ డీఏలు, పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరా రు. జిల్లా నూతన అధ్యక్షుడిగా చింతల లింగం, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డిని ఎన్నుకున్నారు. సమావేశం లో సీహెచ్ లక్ష్మి, విజయ, శ్రీ, తృప్తి శ్రీనివాస్, హరిసింగ్, నరేందర్, గోపి, శ్రీనివాస్, సిహెచ్ ప్రకాష్, కృష్ణ, కృష్ణమూర్తి, హరీష్, కెఎన్ భగత్, రామాగౌడ, రమేష్ పాల్గొన్నారు.