సర్పంచ్‌ల సంఘం జేఏసీ
హైదరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో సర్పంచ్‌లు చేసిన పనులను సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సర్పంచ్ సంఘం జేఏసీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని చూపిస్తూ నివాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
పదవీ కాలం అయిపోయి ఎనిమిది నెలలు కావస్తున్నా బిల్లులపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై మండిపడ్డారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి రాంపాక, నాయకులు నాగయ్య మెడబోయిన గణేశ్, నవీన్ గౌడ్, మాట్ల మధు, సముద్రాల రమేశ్, శాతరాజు పల్లి ఆంజనేయులు, కొయ్యడ రమేశ్, నరబట్ట అజిత్ బాబు, బాలస్వామి, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు .