calender_icon.png 10 January, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బిల్లులు వెంటనే జమ చేయాలి

09-01-2025 12:00:00 AM

సిరిసిల్ల, జనవరి 8 (విజయ క్రాంతి): పెండింగ్‌లో ఉన్న  ఉద్యోగుల బిల్లులు. ఉపాధ్యాయుల బిల్లులు వెంటనే ఖాతాలో జమ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు పరకాల రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రెజరరీ అధికారికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆన్లున్లో క్లెయిమ్ చేసి డీటివో కార్యాలయానికి సమర్పించిన బిల్లులు ఏళ్లు గడుస్తున్న  ఉద్యోగుల ఖాతాలలో జమకాలేదన్నారు.  పెండింగ్లో ఉన్న బిల్లులలో సరెండర్ లీవ్, డి.ఏ. ఏరియర్స్, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, జి.పి.ఫ్. పార్ట్ ఫైనల్, సప్లమెంటరీ శాలరీ బిల్లులు ఎన్నో ఉన్నాయన్నారు.

అట్టి పెండింగ్ బిల్లుల మంజూరు కొరకు రాష్ర్ట ఖజానా శాఖకు డీటివో ఒత్తిడి తేవాలని కోరడం జరిగిందన్నారు.డీ టివో నవీన్ కుమార్  సానుకూలంగా స్పందిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ దృష్టికి  సమస్యను తీసుకువెళ్లి  పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా కోశాధికారి అంబటి రమేష్, జిల్లా కార్యదర్శి ఎలగొండ రవి, వద్యారం మధుసూదన్ లు ఉన్నారు.