calender_icon.png 23 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

22-02-2025 11:26:33 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని టీజీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారాయణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో టీజీవో కేంద్ర కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ... ఈ పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేట్ అధ్యక్షులు బి.శ్యామ్, కోశాధికారి ఎం.ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.