జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు...
సంగారెడ్డి (విజయక్రాంతి): ధరణి దరఖాస్తులను ఉన్న వెంటనే పరిష్కారానికి తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియరెన్స్ చేయాలని కలెక్టర్ క్రాంతి వల్లూరు(Collector Kranti Valluru) తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రెవెన్యూ అధికారులతో పాటు, మీసేవ సంబంధిచిన ఆన్ లైన్ సమస్యలపై ఇడి ఏం ఉదయ్ ను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటివరకు పరిష్కరించిన దరఖాస్తుల వివరాలు, పెండింగ్ వివరాలు ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్, పెండింగ్ మ్యూటేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం అలసత్వం వహించకుండా నిర్ణీత రోజులలో ఇవ్వాలి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పెండింగులో లేకుండా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు.