మరో సెమీస్‌లో అరీనా సబలెంకా విజయం
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్ ఆడేది ఎవరో తేలిపోయింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో దుమ్మురేపిన సబలెంకా సెమీస్‌లో నవ్వారోను ఓడించి దిగ్విజయంగా ఫైనల్లో అడుగుపెట్టగా.. మరో సెమీస్‌లో ముచోవాకు షాకిచ్చిన పెగులా తొలిసారి గ్రాండ్‌స్లామ్ తుది పోరుకు అర్హత సాధించింది. గతేడాది
రన్నరప్‌గా నిలిచిన సబలెంకా ఈసారి చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తుందా లేక ఇప్పటిదాకా కెరీర్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గని జెస్సికా పెగులా యూఎస్ ఓపెన్ సాధించి ఆ లోటును తీర్చుకుంటుందా అన్నది ఆసక్తికరం.
పారిస్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్ చివరి అంకానికి చేరుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ బెలారస్ బామ సబలెంకా, అమెరికా చిన్నది జెస్సికా పెగులా మధ్య జరగనుంది. గతంలో రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన సబలెంకా ఈసారి యూఎస్ ఓపెన్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు పెగులా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక గురువారం అర్థరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఎమ్మా నవ్వారోపై సబలెంకా.. ముచోవాపై పెగులా విజయాలు సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు.
తొలుత ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 6 7 (7/2)తో ఎమ్మా నవ్వారో (అమెరికా)పై సునాయస విజయాన్ని సాధించింది. గంటన్నర వ్యవధిలో ముగిసిన మ్యాచ్‌లో సబలెంకా ప్రత్యర్థి నవ్వారోపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో 8 ఏస్‌లు సంధించిన సబలెంకా 34 విన్నర్లు కొట్టింది. మరోవైపు సబలెంకాతో పోలిస్తే 13 అనవసర తప్పిదాలు మాత్రమే చేసిన నవ్వారో 13 విన్నర్లకే పరిమితమైంది. రెండు సెట్లలోనే మ్యాచ్ ముగిసినప్పటికీ టై బ్రేక్ ద్వారా సబలెంకా రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకోవడం విశేషం.
మరో సెమీస్‌లో పెగులా (అమెరికా) 6 6 6 కరోలినా ముచోవా (చెక్ రిపబ్లిక్)పై విజయాన్ని నమోదు చేసుకొని తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2 గంటలకు పైగా సాగిన పోరులో ముచోవా ఆరు ఏస్‌లు సంధించినప్పటికీ 40 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు పెగులా 1 ఏస్‌తో పాటు 17 విన్నర్లు కొట్టింది. నేడు జరగనున్న పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సిన్నర్‌తో జాక్ డ్రాపర్ (బ్రిటన్), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)తో తన దేశానికే చెందిన టియాఫోతో అమీతుమీ తేల్చుకోనున్నారు. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా ఇటలీకి చెందిన సారా ఎర్రాని ద్వయం నిలిచింది.
ఓలీ పోప్ సెంచరీ
లండన్: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగు తున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్ సెంచరీతో మెరిశాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన పోప్ 102 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. వెలుతురులేమి కారణంగా తొలిరోజు ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. పోప్‌తో పాటు బ్రూక్ క్రీజులో ఉన్నాడు. అంతకముందు ఓపెనర్ బెన్ డకెట్ 86 పరుగులతో రాణించాడు.
శౌర్యకు పసిడి
డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్
హనోవెర్: జర్మనీ వేదికగా జరుగుతున్న ప్రపంచ డెఫ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా శుక్రవారం పురుషుల 50మీ రైఫిల్ పొజిషన్ ఫైనల్లో షూటర్ శౌర్య సైనీ (452.4 పాయింట్లతో) స్వర్ణం చేజెక్కించుకున్నాడు. అంతకముందు క్వాలిఫికేషన్ రౌండ్‌లో శౌర్య 580 పాయింట్లు సాధించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. కాగా ఈ టోర్నీలో శౌర్యకు ఇది రెండో పతకం.
ఇంతకముందు పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో రజతం నెగ్గాడు. ఇక పురుషుల 25 మీ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో చేతన్ హన్మంత్ కాంస్యంతో మెరిశాడు. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 17 పతకాలు చేరగా.. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి.