calender_icon.png 4 April, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమానికి పెద్దపేట

03-04-2025 06:34:15 PM

ఎమ్మెల్సీ దండే విఠల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. గురువారం పెంచికల్పేట్, పోతపల్లి గ్రామంలోని రేషన్ షాప్ ల వద్ద లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందించేందుకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. బహుతరమైన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టడం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. దొడ్డు బియ్యం తినలేక ఎంతోమంది సద్వినియోగం చేసుకోలేకపోయారని అది గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.