calender_icon.png 7 February, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినా పెద్దపెల్లి సత్యనారాయణ

07-02-2025 07:42:56 PM

మందమర్రి (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ నిజాంబాద్ మెదక్ అదిలాబాద్ నియోజకవర్గం పట్టణానికి చెందిన వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ పెద్దపల్లి సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కరీంనగర్ లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్రుల గొంతుకగా వారి సమస్యల పరిష్కారానికి, ఉద్యోగ నియామకాలకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రుడు తన ఆదరించి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని అంతకుముందు పట్టణంలోని మార్కెట్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నామినేషన్ దాఖలకు బయలుదేరి వెళ్లారు. నామినేషన్ బయలుదేరిన ఆయనకు అంబేద్కర్ సంఘం నాయకులు మొయ్య రాంబాబు, కనకం రవీందర్, ముల్కల రాజేంద్రప్రసాద్, తుంగపిండి ఉపేందర్, బీసీ సంఘం నాయకులు సాదుల విద్యాసాగర్, చేగొండ సత్యనారాయణ, రమేష్, ప్రజాసంఘాల నాయకులు మధు, సత్యం బాబు, రవి, డేవిడ్ లు మద్దతు ప్రకటించారు.