calender_icon.png 22 February, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బట్వాన్ పల్లిలో భీమయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ

22-02-2025 01:15:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో ఈనెల 16న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిని కోల్పోయి రోడ్డున పడ్డ ఇడిగిరాల భీమయ్య కుటుంబాన్ని శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరును ఆయన బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించి నిత్యవసర సరుకులు అందజేసిన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని వారిని అభినందించారు.

నిత్యవసర వస్తువులతోపాటు రెండు తులాల బంగారు నగలు, రూ 2 లక్షల నగదుతో పాటు తన కుమారుని డిగ్రీ సర్టిఫికెట్లు కాలిపోయాయని బాధితుడు భీమయ్య ఎంపీ కి తన గోడు వెల్లబోసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భీమయ్య కుటుంబ సభ్యులకు ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అనంతరం బెల్లంపల్లి లోని కన్నాల రహదారిని పరిశీలించారు.అంతకుముందు బెల్లంపల్లిలో కాంగ్రెస్ నాయకులు లెంకల శ్రవణ్ జన్మదిన వేడుకల్లో ఎంపీ వంశీకృష్ణ పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, కుంభాల రాజేష్, బెల్లంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సిన్గతి సత్యనారాయణ, రామటెంకి హరికృష్ణ, దుర్గం వెంకటస్వామి, భాకం కొమురయ్య , బరిగల రఘు, రవి తదితరులు పాల్గొన్నారు.