అదనపు కలెక్టర్ వేణు
పెద్దపల్లి, డిసెంబర్ 13 (విజయక్రాంతి): రైతులకు వరి ధాన్యానికి సంబంధించి డబ్బుల చెల్లింపులో పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అదనపు కలెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2 లక్షల 40వేల 451 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్టు తెలిపారు.
ఇందులో సన్నరకం లక్ష 79వేల 598 మెట్రిక్ టన్నులు, 60 వేల 82 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ధాన్యం కొన్నట్టు తెలిపారు. రూ. 555 కోట్ల 80 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉండగా రూ.508 కోట్ల 91 లక్షలు (91 శాతం) రైతులకు చెల్లింపులు జరిగాయన్నారు. రైతులకు రూ.75 కోట్ల 82 లక్షల బోనస్ రాగా రూ.63 కోట్ల 42 లక్షల 94వేలు చెల్లింపులు జరిగాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు లకు ఇబ్బంది కలుగకుండా ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ ఉన్నారు.