calender_icon.png 23 November, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల బోనస్ రైతుల ఖాతాలలో జమ

23-11-2024 01:46:10 PM

48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు అందిస్తున్నాం

ధాన్యం కొనుగోలు పై మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్  డి.వేణు

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో సన్న రకం వడ్ల కు బోనస్ కింద ఇప్పటి వరకు 8 కోట్ల 46 లక్షల రూపాయలు చెల్లించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ... పెద్దపల్లి జిల్లాలో 329 ధాన్యం కొనుగోలు ప్రతిపాదించి, 320 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఇప్పటివరకు 268 కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభమైందన్నారు. రామగుండం, మంథని మొదలగు ప్రాంతాలలో కోతలు ఆలస్యంగా జరుగుతాయని, అక్కడ మినహా ప్రతి చోట దాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు

జిల్లాలో ఇప్పటి వరకు 12 వేల 829 మంది రైతుల నుంచి 189 కోట్ల 15 లక్షల రూపాయల విలువ గల 81 వేల  537.94 మెట్రిక్ టన్నుల (దొడ్డు రకం 31 వేల 701, సన్న  రకం 49  వేల 836)  కోనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేశామని, రైతులకు 80 శాతం మేర అనగా 151 కోట్ల 20 లక్షల రూపాయల ధాన్యం డబ్బులు వారి ఖాతాలలో జమ చేశామని తెలిపారు.  సన్న రకం ధాన్యం క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం రూ. 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, జిల్లాలో ఇప్పటి వరకు 4051 మంది రైతులకు 15 కోట్ల 34 లక్షల రూపాయలు బోనస్ ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసామని, ఇప్పటి వరకు 8 కోట్ల 46 లక్షల బోనస్ రైతులకు చెల్లించిందని, ప్రతి మండలానికి 2 ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షిస్తున్నామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా  ధాన్యం కొనుగోలు చేపట్టామని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 33 రకాల సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు సర్టిఫై చేస్తున్నారనని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడ్ క్లీనర్, తేమ యంత్రాలు, 334 హజ్ క్లీనర్, అవసరమైన గన్ని సంచులు అందుబాటులో పెట్టామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద త్రాగు నీరు విద్యుత్ సౌకర్యం కల్పించామని అన్నారు.  ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.