29-03-2025 12:00:00 AM
నియామకాన్ని పునః సమీక్షంచాలి
పాల్వంచ మార్చి 27 (విజయక్రాంతి) భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కెపి జగన్నాధపురం లో గల శ్రీ కన కదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడి దేవాలయం పాలకమండలి కమిటీ నీ పునర్ సమీక్షించాలని పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు కోరారు.
శుక్రవారం పా ల్వంచలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ కమి టీలో జగన్నాధపురం, కేశవాపురం గ్రామస్థులకు అవకాశం కల్పించి సమతుల్యత పా టించాలన్నారు. ఎన్నికల నుండి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కి అనుబంధ కార్మిక సంఘానికి సంబంధం లేని ఉద్యోగులకు డైరెక్టర్ల స్థానాల్లో చోటు కల్పించడం బాధాకరమన్నారు.
పాల్వంచ మం డల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోలేదని, దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లను ఉద్దేశ పూర్వకంగా దేవాదాయశాఖ అదికారులు ఫైనల్ లిస్ట్ నుండి తొలగించడం పై విచారణ జరపాలని వారు కోరారు.
విలేకరుల సమావేశంలోసీనియర్ కాంగ్రెస్ నాయకులు బానోత్ రాము నాయక్, బట్టు మురళి, జిల్లా టీపీసీసీ లేబర్ సెల్ అధ్యక్షులు సాదం రామకృష్ణ, పట్టణ కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి భువన సుందర్ రెడ్డి, కొమర్రాజు విజయ్,కాపర్తి వెంకటా చారి, పట్టణ sc సెల్ అధ్యక్షులు పెంకి శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నాయకులు హెచ్చు మధు, పవన్, పాల్వంచ రూరల్ కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు కట్టా సోమయ్య, హుస్సేన్ నాయక్,సతీష్, వేమా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.