calender_icon.png 27 October, 2024 | 2:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెదవాగు గండిపె తుమ్మల సీరియస్

22-07-2024 01:22:23 AM

నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

టూర్ డైరీని సమర్పించాలని ఆదేశం

బాధిత రైతులను తప్పకుండా ఆదుకొంటాం: మంత్రి తుమ్మల 

వరదప్రభావిత ప్రాంతాల్లో  పర్యటన..  నష్టంపై తనిఖీ

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవెల్లి పెదవాగు ప్రాజెక్టుకు గండి పడడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిపారుదలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గండి పడినట్టు రైతులు చెప్పడంతో వారినుంచి జూన్, జూలై నెలల టూర్ డైరీని అందజేయాలని ఆదేశించారు.

ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించారు. వరదల కారణంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, ప్రజలతో మాట్లా డారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొంటుందని హామీ ఇచ్చారు. వరద తాకిడితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సహయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. 

నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం

అశ్వారావుపేట గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్, వైద్యం, ఆర్‌అండ్‌బీ, పంచా యతీరాజ్, ఐటీడీఏ, పోలీస్ అధికారులతో వరదతో జరిగిన పంట నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదట నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు గండి పడటానికి గల కారణాలను, తీసుకొన్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. నీటిపారుదలశాఖ ఈఈ సురేష్‌కుమార్‌ను ప్రాజెక్టు ఎప్పుడు తనిఖీ చేశారు? అని అడుగగా, జూన్ నెలలో తనిఖీ చేశానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశా రు. జూలైలో ఎందుకు తనిఖీ చేయలేదని మండిపడ్డారు. వరదలను ముందుగానే అం చనా వేసి గేట్లను తెరిచి ఉంచితే ఈ నష్టం జరిగేదు కాదు కదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు గండి పడటానికి గల కారణాలను సమగ్ర విచారణ చేసి నివేదిక అందజేయాలని కలెక్టర్ జితేష్ వీ పాటిల్‌ను ఆదేశించారు. 

వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు..

వరదల అనంతరం తీసుకొన్న చర్యలేమిటని కొత్తగూడెం ఆర్డీవో మధును మంత్రి తుమ్మల ప్రశ్నించారు. గుమ్మడవల్లి, కొత్తూ రు, అనంతారం గ్రామాల్లో 70 కుటుంబాలకు చెందిన 250 మందిని పునరావాసం కల్పించామని ఆర్డీవో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వారికి ఆదివారం సాయంత్రం వర కు కుటుంబానికి 10 కిలోల బియ్యం, కందిపప్పు, మంచి నూనె ప్యాకెట్, కూరగాయలు అందజేయాలని మంత్రి ఆదేశించారు. పం చాయతీ అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో నీరు నిల్వ లేకుం డా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడా బ్లీచింగ్ చల్లకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో శానిటేషన్ ఎప్పటికప్పుడు నిర్వహించాలని, సుర క్షిత మంచినీరు సరఫరా చేయాలని, పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.

విద్యుత్తు అధికారులు స్తంభాలను , కాలిన ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతు చేసి గ్రామాల్లో సమ స్యలు తొలగించాలని చెప్పారు. వైద్యశాఖ అధికారులు గ్రామాల్లో వైద్య శిబిరాలుఏర్పాటు చేయాలని, విషజ్వరాలు ప్రభల కుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామం లో ఏఎన్‌ఎం, అంగన్వాడీ, ఆశాలతో ఇంటిం టి సర్వే చేయించాలని స్పష్టంచేశారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ అధికారులు వరద తో ఎంత మేరకు పొలాలు నష్టపోయాయో సర్వే నిర్వహించి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. నష్ట పోయిన రైతులు అందరికీ సహయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పూర్తి నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించాలని ఆదేశించారు. 

ప్రాణ నష్టంలేకుండా చూశాం

పెదవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్టుకు గండి పడినా ఆస్తి నష్టంతోపాటు గ్రామాల్లో ప్రాణ నష్టం లేకుండా చూశామని మత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ప్రతి రైతును ప్రభుత్వం అదుకొంటుందని భరోసా ఇచ్చారు.  ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సీజన్ వరకు ఇప్పుడున్న వరదకు తగ్గట్టుగా పటిష్ట డిజైన్‌తో శాశ్వత ప్రాతిపాదికపై ప్రాజె క్టు నిర్మాణం చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ఇరిగేషన్ సీఈవో శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ ఎస్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మధు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, ఉద్యానవనశాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.