calender_icon.png 1 November, 2024 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిష్ఠ స్థాయికి విద్యుత్ డిమాండ్

19-04-2024 01:48:58 AM

l జీహెచ్‌ఎంసీలో 4 వేల మెగావాట్లకుపైగా చేరిక

l గతేడాదితో పోల్చితే 16.11 శాతం వృద్ధి

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్తు డిమాండ్ రోజురోజకూ పెరుగుతోంది. గురువారం ఆల్‌టైం రికార్డుగా 4,053 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ నమోదయ్యింది. గతేడాది మే 19న గ్రేటర్ పరిధిలో 3,756 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదుకాగా.. ఈ ఏడు ఒక నెల రోజుల ముందుగానే ఏప్రిల్ 18న ఆ రికార్డును తుడిసిపెట్టేసింది.  గడిచిన మూడేండ్లలో గ్రేటర్‌లో నమోదైన విద్యుత్తు డిమాండ్, వినియోగం ఇలా ఉంది.

గ్రేటర్ పరిధిలో గరిష్ఠ డిమాండ్, వినియోగంలో భారీగా పెరుగుదల నమోదవుతోంది. 2022లో గ్రేటర్ పరిధిలో ఏప్రిల్ నెలలో సగటున 3,092 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఉండగా.. 2023 ఏప్రిల్ నాటికి 3,148 మెగావాట్లకు చేరింది. అంటే సగటున 50 మెగావాట్లు పెరిగింది. దాని శాతం 1.81 మాత్రమే. కానీ అదే 2024 ఏప్రిల్‌లో చూసుకుంటే 3,655 మెగావాట్లకు చేరింది. అంటే సగటు డిమాండ్ 510 మెగావాట్లకు పెరగడంతో 16.11 శాతం వృద్ధి నమోదయ్యింది. వినియోగం విషయంలోనూ 2022 ఏప్రిల్‌లో 66.16 మిలియన్ యూనిట్ల సగటు నమోదవ్వగా 2023లో 66.80 మిలియన్ యూనిట్ల (0.97 శాతం వృద్ధి) సగటు ఉంది. 2024 ఏప్రిల్ నాటికి 78.55 మిలియన్ యూనిట్ల సగటుతో 17.59 శాతం వృద్ధి నమోదయ్యింది. 

అంశం 2022 ఏప్రిల్ 2023 ఏప్రిల్ 2024 ఏప్రిల్ 

సగటు డిమాండ్

(మెగావాట్లు) 3092 3148 3655

సగటు వినియోగం

(మిలియన్ యూనిట్లు) 66.16 66.80 78.55

డిమాండ్ వృద్ధి (శాతం) 1.81 16.11

వినియోగంలో వృద్ధి(శాతం) 0.97 17.59