calender_icon.png 24 February, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనావాసాల్లోకి జాతీయ పక్షి

02-11-2024 02:03:08 PM

మలక్‌పేట,(విజయక్రాంతి): నగరంలో ని మలక్‌పేట అజoపురాలో శనివారం జనవాసాల మధ్య  జాతీయ పక్షి నెమలి వచ్చింది. ఈ విషయం గమనించిన స్థానిక పాన్ షాప్ వ్యాపారి  మహమ్మద్ అంజద్ పట్టుకొని చాదర్ ఘాట్  పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. నెమలి ఎక్కడినుండి జనవాసాల్లోకి వచ్చిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జాతీయ పక్షిని అటవీ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు