calender_icon.png 28 April, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిరిసనగండ్లలో ఘనంగా శాంతి కల్యాణం

28-04-2025 12:38:16 AM

చారకొండ, ఏప్రిల్ 27 : అపర భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల సీతారా మచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకలో భాగంగా ఆదివారం ఆలయ ధర్మకర్తలు డేరం వంశస్తుల ఆధ్వర్యంలో స్వామి వారికి శాంతి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ ఈ సంవత్సరం ఎలాంటి ఆటం కాలు లేకుండా స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగడంతో శాంతి కల్యాణం నిర్వ హించారు.

శ్రీ సీతారామచంద్ర స్వామినీ భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డేరం వంశస్థులు రామశర్మ, డేరం లక్ష్మణ శర్మ , మురళీధర్ శర్మ, గోపికృష్ణ శర్మ, వేణుగోపాల శర్మ, సీతారామ శర్మ, అనంతరామ శర్మ, రిషికేశ్ శర్మ, శ్రీధర్ శర్మ, దేవేందర్ శర్మతో పాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు.