ఖాకీల కనుసైగల్లో ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు...
కాఖీలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
మంథని (విజయక్రాంతి): నవరాత్రులు పూజలందుకున్న గణనాథునికి మంగళవారం ఘనంగా భక్తులు మంథని గోదావరిలో ఘనంగా వీడ్కోలు పలికారు. మంథని లో కాకిల కనుసైగల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్య పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. రెండు రోజులుగా నిమజ్జన వేడుకలు నిర్వహించారు. గత వారం రోజుల నుంచి రామగుండం సిపి శ్రీనివాస్, డిసిపి చేతన ఆదేశాలతో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ సూచనల మేరకు మంథని సిఐ రాజు, ఎస్సై రమేష్ లు భారీ బందోబస్తు మధ్య మంథని పట్టణంలో, మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించారు. గతంలో జరిగిన ఘటనలు గుర్తుపెట్టుకుని నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతూ ఎలాంటి గొడవలకు తావు లేకుండా పరిస్థితులు చక్కదిద్దారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పోలీస్ శాఖ ను ప్రజలు ప్రశంసిస్తున్నారు.