జగిత్యాల అర్బన్, డిసెంబర్ 2: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గురువారం శాంతి యుత మహా ర్యాలీ నిర్వహించారు. తాసి ల్దార్ కార్యాలయం నుండి పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. తమ న్యా యపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు.
అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సమ గ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి వెంటనే తమ ఉద్యోగాలు రెగ్యు లరైజ్ చేయాలని అప్పటివరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ గ్ర శిక్ష ఉద్యోగుల సమస్య పరిష్కార సాధ నకు అండగా ఉంటానని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ పేర్కొ న్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిర వధిక సమ్మెలో గురువారం పాల్గొని మద్ద తు తెలిపారు.