calender_icon.png 21 January, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా పోలింగ్

19-09-2024 03:34:50 AM

తొలి విడతలో 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

58.౮౫శాతం ఓటింగ్ నమోదు

కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్

ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 18: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. రాత్రి ౭.౩౦ గంటల వరకు 58.౮౫ శాతం పోలింగ్ నమోదైంది. 10 ఏళ్ల తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో తొలి విడతలో భాగంగా బుధవారం 7 జిల్లాలకు చెందిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కిష్టార్, త్రాల్, పాంపోర్, రాజ్‌పుర, పుల్వామా, శోపియాన్, కుల్గాం, అనంతనాగ్, అనంతనాగ్ వెస్ట్, శ్రీగుఫ్వాడా వంటి సున్నితమైన నియోజకవర్గాలకు ఈ ఫేజ్‌లో ఓటింగ్ నిర్వహించారు. 

కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్ కేంద్రాల ఉదయం నుంచే వద్ద ఓటర్లు బారులు తీరడం కనిపించింది. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా 7 జిల్లాల వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం డాటా ప్రకారం ఇందర్‌వాల్ సెగ్మెంట్‌లో 80.06 శాతంతో అత్యధిక పోలింగ్ నమోదైంది. తర్వాతి స్థానాల్లో పద్దర్‌ెపూొగ్‌సెని (76.80 శాతం), కిష్టార్ (75.04 శాతం), దొడా వెస్ట్ (74.14 శాతం) ఉన్నాయి. కశ్మీర్ లోయలోని పహల్‌గామ్ నియోజకవర్గంలోనూ రికార్డు స్థాయిలో 67.86 శాతం ఓటింగ్ నమోదైంది. త్రాల్‌లో అత్యల్పంగా 40.58 శాతం పోలింగ్ జరిగింది. 24 నియోజకవర్గాల్లో మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో పురుషులు 210, మహిళలు 09 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 23.27 లక్షలు.  

ప్రధాని, రాహుల్ విజ్ఞప్తి

జమ్ముకశ్మీర్ తొలి దశ పోలింగ్‌లో భాగంగా ఆయా సెగ్మెంట్లలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇండియా కూటమికే ఓటు వేయాల ని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ప్రజలను కోరారు. అప్పుడే జమ్ముకశ్మీర్ కోల్పోయిన రాష్ట్రహోదా, ప్రజల హక్కులు, ఉద్యోగావకాశాలు తిరిగి వస్తాయని చెప్పారు.