21-04-2025 12:00:00 AM
ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : నియోజకవర్గంలో ఆలయాల నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలం పెండల్ వాడ లో శ్రీ మహాశక్తి మైసమ్మ తల్లి ఆలయం ప్రవేశ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ...మైసమ్మ తల్లి ఆలయాన్ని గ్రామ స్తులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి చేసుకోవడం హర్షణీయమని అన్నారు.
ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఆలయాల నిర్మాణాలకు తమ వంతు సహకారం ఉంటుం దని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రాందాస్, ప్రవీణ్, వెంకన్న, ఉల్లాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.